- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరూ చాయ్ తాగడంలేదంట.. ఏమంటే..?
దిశ ప్రతినిధి, ఖమ్మం : కరోనా భయాలు వీడటం లేదు.. అవసరమైతే తప్పా జనాలు రోడ్డెక్కడం లేదు. ఫలితంగా వీధి వ్యాపారులకు గిరాకీ లేకుండాపోయింది. చిరు వ్యాపారులకు సైతం పొద్దంతా షాపులో కూర్చున్న కూలీలకు వచ్చే డబ్బులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంఘటిత రంగంపై ఆధారపడి జీవనం సాగించేవారి సంఖ్య 60 శాతానికి పైగానే ఉంటుందని అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజల సంఖ్యే ఎక్కువ. ఉరుములేని పిడుగులా వీరిపై కరోనా పిడుగు పడింది. కూలీలకు రెండు నెలలుగా పను ల్లేక విలవిల్లాడుతున్నారు.
భవన నిర్మాణ కూలీ లు, హమాలీలు, తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, ఆటోవాలాలు, చిన్న హోటల్స్ నడుపుకునేవారు ఇలా ప్రతీ వారి ఉపాధిని కరోనా దెబ్బకొట్టింది. వీరిలో ఎక్కువ మంది స్వయం శక్తి సహాయ సంఘాల దగ్గర నుంచి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఆ రుణాల తాలూకు కిస్తీలను నెలకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారాలు చూస్తే ఇలా ఉన్నాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యవంతమవుతున్నారు.
కరోనా భయంతో ఎవరూ టీ తాగడం లేదు: మసూద్, టీ స్టాల్ వ్యాపారి, కొత్తగూడెం
టీ స్టాల్‌పైనే ఆధారపడి బతుకుతున్నా. ఈ పనిచేస్తే గాని నా కుటుంబాన్ని పోషించుకోలేను. లాక్ డాన్ సమయంలో షాపు పూర్తిగా బంద్ చేశాను. అప్పులు చేస్తూ ఇల్లు గడిపాను. ఇప్పుడు కూడా గిరాకీ అంతంత మాత్రంగానే ఉంది. కొత్తగూడెంలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఎవరు చాయ్ తాగడానికి రావడం లేదు.
నూడిల్స్ తినడం లేదు: ప్రవీణ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహాకుడు, కొత్తగూడెం
ఎన్నో సంవత్సరాలుగా నూడిల్స్ వ్యాపారాన్నే నమ్ముకున్నాను. కరోనా వైరస్ మా వ్యాపారాలను దారుణంగా దెబ్బతీసింది. సాయంత్రం 6 గంటల వరకే షాపును నడిపించే అనుమతి ఇచ్చారు. మా నూడిల్స్ వ్యాపారం సాయంత్రం ఆరు గంటల తర్వాతే నడుస్తుంది. ప్రస్తుతానికి ఎనిమిది గంటల వరకు సమయం ఇచ్చినా ప్రజలు కరోనా వ్యాప్తి చెందుతుందని భయపడి ఎవరూ రావడం లేదు.
వ్యాపారం ఏమాత్రం బాగోలేదు: పండ్ల వ్యాపారని,జూపల్లి వెంకటేశ్వర్లు
రోజంతా రోడ్డుపై నిలబడి అమ్మినా రూ.200లు కూడా మిగలడం లేదు. గిరాకీ ఏమాత్రం లేదు. జనాలు రోడ్డు మీదకు రావడం చాలా వరకు తగ్గిపోయింది. శుభకార్యాలు జరిగే రోజుల్లో పండ్ల వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. శ్రావణమాసంలో అయితే గతంలో మంచి రాబడి ఉండేది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉంది. మాములు పరిస్తితులు రావాలని రోజూ దేవుడిని వేడుకుంటున్నాం.
సెలూన్‌కు రావాలంటే జంకుతున్నారు: హెయిర్ సెలూన్ నిర్వాహాకుడు, రాంబాబు, నేలకొండపల్లి
కరోనా భయంతో సెలూన్‌కు రావాలంటే జనాలు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ వస్తున్నా..షేవింగ్ మాత్రం చాలా మంది ట్రిమ్మర్లతో స్వతహాగా చేసేసుకుంటున్నారు. జుట్టు కత్తిరింపునకు కూడా అంతకు ముందు నెలనెలా వచ్చేవాళ్లు ఇప్పుడు రెండు నెలలకోమారు వస్తున్నారు. వినియోగదారులు తగ్గడంతో ఆదాయం తగ్గిపోయింది. షాప్ అద్దె, రోజూవారీ కూలీలకు చెల్లింపులు కష్టంగా మారుతోంది.