- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కాటుకు కుటుంబమే కకావికలం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కనికరంలేని కరోనా వైరస్ ఓకుటుంబానికి పెద్ధ దిక్కు లేకుండా చేసింది. ఇప్పుడు అ కుటుంబానిక పెద్దదిక్కుగా ఉన్న మహిళ కుటుంబభారం మోసేందుకు కూలీ పనులు చేసుకుని తన ఇద్ధరు పిల్లను పోషించుకునే పరిస్థితిని తెచ్చింది. గత నెల వరకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, వారి కొడుకు కోడలు, ఇద్దరు మనువళ్లతో కలకళలాడిన ఇంటిలో కరోనా వైరస్ కరళా నృత్యం చేయడంతో ఇరవై నాలుగు గంటల్లో భార్య భర్తలు మృత్యువాత పడ్డారు. వారితో పాటు వైరస్ బారినపడ్డ కొడుకు ఆరు రోజులకే ఆసుపత్రిలో చనిపోవడంతో ఆకుటుంబంలో అసలు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ హృదయ విదాయకర సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లర్ మండలం మెట్టు గ్రామంలో ఈ నెల మొదటి వారంలో చోటు చేసుకుంది.
మెట్టు గ్రామానికి చెందిన శకుంతల, సామేల్ దంపతులు, వారికి సంజయ్ ఎకైక సంతానం. శకుంతల వైద్యారోగ్యశాఖలో పని చేసి పదవీవిరమణ పోందగా, సామేల్ వ్యవసాయం చేస్తు కుటుంబానికి చెదోడు వాదోడుగా ఉండేవారు. వారి తనయుడు సంజయ్‌కు శిరీషతో 16 ఏళ్ల క్రితం వివాహం కాగా వారికి ఇద్ధరు సంతానం. అందులో ఒకరు పదో తరగతి, మరొకరు ఎనిమిదవ తరగతి, సంజయ్ హైద్రాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటుండగా శిరీష గృహిణిగా ఉండేది. చక్కగా అందరు సంతోషంగా ఉన్న అ కుటుంబం పాలిట కరోనా వైరస్ శనిలా దాపురించింది.
గత నెల చివరి వారంలో శకుంతల, సామేల్ దంపతులతో పాటు కొడుకు కోడలు సంజయ్, శిరీషలకు కరోనా వచ్చింది. వైరస్ నుండి శిరీష ఒక్కరే కోలుకున్నారు. ముగ్గురికి ముగ్గురికి కరోనా వచ్చిన తరువాత శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కొవిడ్ దవాఖానాలో చేరారు. ఈ నెల మొదటి రోజు రాత్రి 12 గంటల సమయంలో శకుంతల కరోనాతో చనిపోగా, తెల్లవారి ఆమె అంత్యక్రియలు చేస్తుండగా ఆమె భర్త సామేల్ వైరస్‌తో పోరాడుతూ మృత్యువాత పడ్డారు. దీంతో ఇద్దరు పెద్ద దిక్కులను కోల్పోయిన అ కుటుంబం సంజయ్‌ని కాపాడుకునేందుకు, అతడిని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌లోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తల్లిదండ్రులు చనిపోయిన ఆరవరోజు అతడిని కుడా వైరస్ మహమ్మారి బలి తీసుకుంది.
వారం రోజుల వ్యవధిలో అ ఇంట్లో అత్తమామాలతో పాటు భర్త మరణించడంతో ఆకుటుంబభారమంతా ఇప్పుడు శిరీషపై పడింది. ఎన్నడు కాలు తీసి బయట పెట్టని ఆమె ఇప్పుడు ఇద్ధరు పిల్లల కోసం బయటకు వెళ్లి పనిచేస్తే గాని కుటుంబం గడువని పరిస్థితి దాపురించింది. ఇద్ధరు పిల్లలను తన గ్రామంలో ఉండి పోషించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే కుటుంబ పోషణకు ఉన్న ఏకైక ఆధారమైన పొలం అమ్మకం గత నెలలో జరుగడం అకుటుంబంపై పెద్ధ భారంగా మారింది. పొలం అమ్మకం కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న సొమ్ము మొత్తం కరోనా వైద్యం కోసం ఖర్చు కాగా అప్పులు మిగిలాయని ఇది తనకు పెనుభారమని ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. కరోనా మహమ్మారి ఇంటిలోని ముగ్గురిని బలి కోరగా వైద్యం కోసం చేసిన అప్పులు, భవిష్యత్తును చూస్తే భయం వేస్తుందని, ప్రభుత్వం అదుకోవాలని ఆ కుటుంబం కోరుతుంది.