దేశంలో రెండు లక్షలు దాటిన కరోనా మరణాలు

by  |
india corona sticker
X

న్యూఢిల్లీ: సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా మారింది. రోజుకు వేలాది మందిని పొట్టనబెట్టుకుంటూ బెంబేలెత్తిస్తున్నది. దేశ ఆరోగ్య వ్యవస్థకే పెనుసవాల్ విసురుతున్నది. మంగళవారం తొలిసారిగా దేశంలో మరణాలు మూడు వేల మార్క్‌ను దాటి ఆందోళనలను రెట్టింపు చేసింది. గడిచిన 24 గంటల్లో 3,293 మంది కరోనా మహమ్మారి బారినపడి ప్రాణం విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య రెండు లక్షలను దాటింది. తాజా మరణాలతో కలుపుకుని 2,01,187 మంది ఈ మహమ్మారితో చనిపోయారు. కొత్త కేసులూ ఎంతమాత్రం తగ్గకుండా భారీగా నమోదవుతూనే ఉన్నాయి. వారం రోజులుగా మూడు లక్షలకు తగ్గకుండా రిపోర్ట్ అవుతున్నాయి.

తాజాగా, 3,60,960 కొత్త కేసులు నమోదయ్యాయి. తొలిసారిగా మూడున్నర లక్షలను దాటేశాయి. దీంతో మొత్తం కేసులు 1,79,97,267కు చేరాయి. యాక్టివ్ కేసులూ భారీగా పెరిగాయి. దాదాపుగా 30 లక్షలకు చేరువయ్యాయి. బుధవారం ఉదయంనాటికి 29,78,709 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు చాలా తక్కువగా ఉండటం కలవరం పెడుతున్నది. కనీసం లక్షల కేసుల తేడా ఉంటున్నది. కొత్త కేసులు 3.60లక్షలుగా రిపోర్ట్ కాగా, రికవరీలు 2.61 లక్షల దగ్గరే ఉండిపోయాయి. ఈ లెక్కన రోజుకు లక్ష యాక్టివ్ కేసులను పెంచుకునే పెనుప్రమాదపు ముంగిట్లో దేశం నిలబడ్డట్టు అర్థమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed