కరోనా మరణాలు జాతీయ సగటు కన్నా తక్కువే : ఈటల

by Shyam |
కరోనా మరణాలు జాతీయ సగటు కన్నా తక్కువే : ఈటల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం వర్క్‌స్పేస్‌ మెటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ సంక్షేమశాఖకు అందజేసిన సెల్ఫ్‌ చెక్‌ కియోస్కి యంత్రాన్ని హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో మంత్రులు ఈటల, కొప్పుల ఈశ్వర్‌ సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా విస్తరిస్తున్న దృష్ట్యా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అందరూ భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

Next Story