హుజురాబాద్‌ ప్రజలకు షాకిస్తున్న కరోనా.. రైతు మృతి

by Sridhar Babu |
Corona
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం బై ఎలక్షన్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు, పలువురు నేతలు రోజు గుంపులుగుంపులుగా సంచరిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లో కరోనా మరణం నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అయితే, నియోజకవర్గంలోని కాట్రపల్లి గ్రామంలో ఓ రైతు కరోనాతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల ఆయన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడే కరోనా సోకినట్లు తెలుస్తుండగా.. వెంటనే ఆ రైతును హనుమకొండ, కరీంనగర్‌లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆదివారం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె కలరు.

Advertisement

Next Story