బ్రేకింగ్.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా బులిటెన్ ఇదే..

by Anukaran |   ( Updated:2022-01-07 08:22:12.0  )
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,195 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 302 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 77,002 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.
ఇక, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరుగులు తీస్తోంది. దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 781కు పెరిగింది. రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల విషయంలో అధికారులు అలర్ట్ అయ్యారు.

Advertisement

Next Story