వంద దాటిన ఒమిక్రాన్ కేసులు.. దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్

by Anukaran |   ( Updated:2021-12-18 23:59:24.0  )
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వంద మార్క్‌ను క్రాస్ చేశాయి. మరోవైపు తెలంగాణలో శనివారం ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి.

అయితే, తాజాగా దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 7,081 కేసులు నమోదు కాగా.. ఇదే సమయంలో వైరస్ బారినపడి 264 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 83,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,47,40,275 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬4,77,422 కరోనా మరణాలు సంభవించాయి. ఇక, శనివారం ఒక్కరోజే 76,54,466 మందికి టీకాలు అందించారు.

Advertisement

Next Story