ఏపీలో హాఫ్ సెంచరీ కేసులు.. 2000కి చేరువలో కరోనా

by srinivas |
ఏపీలో హాఫ్ సెంచరీ కేసులు.. 2000కి చేరువలో కరోనా
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తారస్థాయికి చేరుతోంది. ఏరోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య అర్థ సెంచరీలు దాటిస్తూ, 2000 కేసుల దిశగా ఏపీ దూసుకెళ్తోంది. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు సెంచరీ దాటడం ఆందోళన కలిగిస్తున్న విషయం. కాగా, గడచిన 24 గంటల్లో ఏపీలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ప్రస్తుతం 1980 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

చిత్తూరు జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ప్రస్తుతం 112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 74 మంది నయమై ఇళ్లకు వెళ్తే.. 38 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా కేసులకి రాజధానిగా మారిన కర్నూలు జిల్లాలో వరుసగా రెండు రోజులు సింగిల్ డిజిట్‌లో కేసులు నమోదు కావడంతో అక్కడ కరోనా తగ్గుముఖం పట్టిందని అధికారులు అంచనా వేశారు. అయితే వారి అచనాలను తల్లకిందులు చేస్తూ నేడు కర్నూలు జిల్లాలో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 566కి చేరింది. వారిలో 311 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 239 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 16 మంది మృత్యువాత పడ్డారు.

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం 382 కేసులు నమోదుకాగా, 176 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 198 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదైంది. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 339కి చేరుకుంది. ఇందులో 189 మంది చికిత్స పొందుతుంటే, 137 మంది కోలుకున్నారు. 13 మంది మరణించారు.

అనంతపురం జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కేసుల సంఖ్య (107) సెంచరీ దాటేసింది. 58 మంది చికిత్స పొందుతుంటే, 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. నలుగురు మృత్యువాత పడ్డారు. విశాఖపట్టణం జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. ఇక్కడ కేసుల సంఖ్య 63. వారిలో 37 మంది చికిత్స పొందుతుంటే 25 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మరణించారు.

కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1980కి చేరుకుంది. వారిలో ఇప్పటివరకు 925 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారు. 1,010 మంది చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Advertisement

Next Story