- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ విద్యాసంస్థల్లో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థల్లో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆగస్టు 16న తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలు.. పది రోజులు కూడా గడవక ముందే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం 8 మంది ఉపాధ్యాయులకు, ఐదుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది.
అలాగే మంగళవారం 13 మంది టీచర్లలో 9మందికి, 35మంది పిల్లల్లో ఐదుగురికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ నెల 22న డక్కిలి మండలంలో ఓ ఉపాధ్యాయుడు కరోనాతో మృతి చెందారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి జడ్పీ హైస్కూల్‌లోని ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. ఏడు, తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థులకు జ్వర లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
అలాగే ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 12కు చేరింది. పీవీఆర్ బాలికల హైస్కూల్‌లో ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
అలాగే చిత్తూరు జిల్లాలో 17 మంది ఉపాధ్యాయులు, 10 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. అలాగే విజయనగరం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. చీపురుపల్లి మండలంలోని నిమ్మలవలస ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే పూసపాటిరేగ, కుమిలి ఉన్నత పాఠశాలలో ఇద్దరు పదో తరగతి విద్యార్ధినులకు కరోనా నిర్ధారణ అయ్యింది.
పాఠశాలల్లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్‌లో కొవిడ్ థర్డ్ వేవ్‌పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.