ఖమ్మంలో 200చేరువలో కరోనా కేసులు

by Sridhar Babu |
ఖమ్మంలో 200చేరువలో కరోనా కేసులు
X

దిశ , ఖ‌మ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 199 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. బుధవారం గాంధీ చౌక్‌లో 83ఏండ్ల మహిళ కరోనాతో మృతి చెందింది. తాజాగా మరో 9మందికి పాజిటివ్ సోకింది. వీరంతా ఖమ్మం నగరంలోని గుట్టల బజార్, కమాన్ బజార్ ,ఆర్టిఓ ఆఫీస్, నిజాంపేట ,టీఎన్జీవోస్ కాలనీ, శ్రీనివాస్ నగర్ గాంధీ చౌక్, నాయుడుపేట , వేంసూరు మండలం లక్ష్మీపురానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు.

అయితే, ఖమ్మం పరిధిలోని గాంధీ చౌక్ ప్రాంతంలో ఇప్పటికే ఇద్దరు కరోనాతో మృతి చెందగా , తాజాగా మరో మహిళ మృతి చెందిందనే వార్త తెలియడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న గాంధీ చౌక్ ప్రాంతంలో కరోనా మహమ్మారి విజృభిస్తుంది. అంతకంతకూ కేసుల సంఖ్య మరింత పెరిగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మరో 16 కేసులకు సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. జిల్లాలో మరో 124 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కట్టడికి వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ ఫలితం ఆశించిన మేరకు కనిపించడం లేదు.దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు.

Advertisement

Next Story