ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

by srinivas |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 70,695 శాంపిల్స్ పరీక్షించగా 2,010మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,942కి చేరింది. ఇకపోతే నిన్న ఒక్కరోజే కరోనాతో20 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,312కు చేరింది.

అదే సమయంలో 1,956 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,25,631కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,43,24,626 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

Next Story