దేశంలో 78,003 మందికి కరోనా

by vinod kumar |
దేశంలో 78,003 మందికి కరోనా
X

దిశ, న్యూస్‌‌బ్యూరో: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన మూడో విడత లాక్‌డౌన్ నుంచి ఇప్పటివరకు 35,167 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం గడచిన 24గంటల్లో కొత్తగా 3,722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 78,003కు చేరింది. ఒక్కరోజే 134 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 2,549కు చేరుకుంది. ఇప్పటివరకు 26,235 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ప్రతీరోజూ కొత్త రికార్డు నమోదవుతోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఒక్క రోజు వ్యవధిలో 1602 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,524కు చేరుకుంది. ఇందులో 16,738 కేసులు ముంబయిలోనే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా వెయ్యి దాటింది. తొలి కరోనా కేసు నమోదైన కేరళలో మూడ్రోజుల క్రితం వరకూ పరిస్థితి అదుపులోనే ఉన్నా ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ప్రయాణీకులు చేరుకోవడంతో కొత్తగా 26పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 14కేసులు ఇతర రాష్ట్రాలవి కాగా 7విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులవి.

తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా రెండంకెల స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 5రోజుల వ్యవధిలోనే 251 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. ఇందులో దాదాపు 98% జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. తాజాగా 47కొత్త కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,414కు చేరుకుంది. మరోవైపు ఏపీలో ఒక్కరోజే 36కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,100కు చేరింది. 48మంది మరణించారు. తమిళనాడులో 24 గంటల వ్యవధిలో 447 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 9,674కు వెళ్లింది. ఇక్కడ గురువారం కరోనాతో ఇద్దరు చనిపోగా మొత్తం 66 మంది మరణించారు. గుజరాత్‌లో కొత్తగా 324 పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో మొత్తం కేసుల సంఖ్య 9,592కు చేరింది. ఇప్పటివరకు 3,753 మంది వ్యాధి నుంచి కోలుకోగా 586 మంది చనిపోయారు. గోవాలో చాలా రోజుల తర్వాత 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐటీబీపీ జవాన్లు 12మందికి కరోనా సోకడం కలవరపెడుతోంది.

భారత్ :
మొత్తం కేసులు : 78,003
మృతులు : 2,549
రికవరీ : 26,235

తెలంగాణ :
మొత్తం కేసులు : 1,414
మృతులు : 34
రికవరీ : 952

ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 2,205
మృతులు : 48
రికవరీ : 1192

Advertisement

Next Story

Most Viewed