- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాజిటివ్ కేసులపై డీహెచ్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో డీహెచ్ శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. రెండు వారాలుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో 78వేల టెస్టులు చేసినట్టు తెలిపారు. పాజిటివిటీ రేటు కూడా తగ్గిందని అన్నారు. పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉన్నట్టు తెలిపారు. డెత్ రేట్ 0.5 శాతంగా ఉందని వెల్లడించారు.
తెలంగాణలోని గ్రామాల్లో కూడా కరోనా నియంత్రణలో ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారమే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కేంద్రం నుంచి 57 లక్షల 30వేల డోసులు వచ్చాయన్నారు. 18-44 ఏళ్ల వారికి 4 లక్షల 90వేల డోసులు ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.