చైనాను దాటేస్తున్న భారత్

by vinod kumar |   ( Updated:2020-05-15 20:15:24.0  )
చైనాను దాటేస్తున్న భారత్
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. చైనాను దాటే దిశగా దేశం ప్రయాణిస్తోంది. ప్రతీ మూడు రోజులకు పది వేల చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించే సరికి దేశవ్యాప్తంగా 3967 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 81970కు చేరింది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా కరోనాతో 100 మంది మరణించగా ఇప్పటివరకు ఈ వ్యాధి కారణంగా మరణించినవారి సంఖ్య 2649కి చేరింది. దేశంలో ఇప్పటివరకు వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 27919గా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు 21 వేలు దాటగా ఆ తర్వాతి స్థానంలో పదివేలు దాటిన రెండో రాష్ట్రంగా తమిళనాడు ఆవిర్భవించింది.

మహారాష్ట్రలో శుక్రవారం కొత్తగా 1576 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 21467కు చేరింది. ఇక్కడ ఒక్కరోజే 49 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1068కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6564 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాజధాని ముంబైలో ఒక్కరోజే 933 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 17512కు చేరింది. ఇక్కడ ఒక్కరోజే 24 మంది కరోనాతో మరణించారు. తమిళనాడులో శుక్రవారం నమోదైన 385 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 10108కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 71 మంది మరణించారు. గుజరాత్‌లో కొత్తగా 340 మందికి కరోనా సోకడంతో ఇక్కడ కేసుల సంఖ్య 9932కు చేరింది. ఇక్కడ ఇప్పటివరకు కరోనాతో 606 మంది మరణించారు. కేరళలో శుక్రవారం 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 68 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2205కు చేరింది. ఇక్కడ ఇప్పటివరకు 48 మంది కరోనాతో మరణించారు. తెలంగాణలో కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 40 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 1454కు చేరుకుంది.

భారత్ :
మొత్తం కేసులు : 81970
మృతులు : 2649
రికవరీ : 27919

తెలంగాణ :
మొత్తం కేసులు : 1454
మృతులు : 34
రికవరీ : 959

ఆంద్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 2205
మృతులు : 48
రికవరీ : 1252

Advertisement

Next Story

Most Viewed