- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రంతా బెడ్ పైనే కరోనా మృతదేహం
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలో ఉన్న కరోనా ఆస్ప్రతిలోని ఐసీయూలో ఓ పేషెంట్ అర్ధరాత్రి మృతి చెందాడు. అతన్ని పట్టించుకోవడానికి ఇంతవరకు వైద్యులు రాలేదని తోటి కరోనా పేషెంట్లు చెబుతున్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సిద్దిపేట కొవిడ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. బచ్చన్నపేట మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు ఇటీవలే కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండగా అతన్ని ఐసీయూకి తరలించి వైద్యం అందించారు. అయితే, పరిస్థితి విషమించి నిన్న అర్థరాత్రి మరణించాడు. కాగా, ఇప్పటివరకు వైద్య సిబ్బంది ఎవరూ వచ్చి చూడకపోవడంతో మృతదేహం బెడ్ పైన అలానే ఉంది. దీంతో పక్కనున్న తోటి పేషేంట్లు ఆందోళనకు గురవుతున్నారు. చనిపోయిన వ్యక్తి బెడ్ పక్కనే తుక్కపూర్ సర్పంచ్ కూడా చికిత్స పొందుతున్నారు. కరోనా మృతదేహం పక్కనే ఉండటంతో ఆయన తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.