- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లచ్చన్న దారిలో..పూల వయ్యారిలో..
కరోనాపై ఒగ్గు కళాకారుల ప్రచారం
దిశ, కరీంనగర్:
కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి గురించి అన్ని వర్గాల ప్రజలకూ అవగాహన కల్పించాలని ఓ వినూత్న ఆలోచన చేశారు సిరిసిల్ల జిల్లా అధికారులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓల్డ్ ఏజ్ వారికీ విషయం అర్థమవడం, జాగ్రత్తలు పాటించేలా చేయడం ఉద్దేశమని భావించారు. వారిలో కరోనా చైతన్యం కల్పించడం కళాకారులతోనే సాధ్యమని అనుకుని, వారిచేత పాటలు పాడించారు. కళాకారులు కూడా ఇటువంటి మహమ్మారిపై అవగాహన కల్పించడం తమ బాధ్యత అని తెలిపి ఉచితంగానే ప్రదర్శనలకు అంగీకరించారు. ఒగ్గు కళాకారులు వారి శైలిలో ఒగ్గు కథ బాణీలతో కరోనా జాగ్రత్తలపై పాడిన పాటలను వీడియో రికార్డు చేసి విడుదల చేస్తున్నారు అధికారులు. సామాజిక మాధ్యమాల్లో విసృతంగా ప్రచారం చేసేందుకు వారు సిద్ధమయ్యారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో పల్లె పల్లెనా వైరల్ అవుతున్నాయి.
చైతన్యం ‘కరోనా’..
దశాబ్దాల కాలంగా ఒగ్గు కథ అంటే పల్లె ప్రాంతాల్లో ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. ఒగ్గు కథ బాణిలో కరోనా వైరస్‌పై సంపూర్ణ అవగాహన చేసేందుకు ప్రత్యేకంగా రచనలు చేసిన కళాకారులు వాటిని అదే బాణిలో పాడుతూ వీడియోలు రెడీ చేశారు. అవి గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల గ్రామాల్లోని ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వారికీ అర్థం అయి చైతన్యవంతులు అవుతున్నారు.
మార్మోగుతున్న ఒగ్గు బాణీలు..
ప్రపంచాన్నే కుదిపేస్తోన్న కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ఎలా ఉండాలి, లక్షణాలు ఉన్న వారైతే ఎక్కడికెళ్లాలి అన్నవివరాలు పూర్తి స్థాయిలో అందులో పొందరుపరుస్తున్నారు . ‘యవ్వలాలో యవ్వలాలో మాయవ్వలాలో కరోనా వైరస్ గురించి తెలుసుకోండి అవ్వలాల’ అంటూ వేములవాడకు చెందిన బుగ్గయ్య టీం, ‘ హరి హరి రఘునందనా’ అంటూ దేవా టీం తయారు చేసిన వీడియోలు ఇప్పుడు సిరిసిల్ల పల్లెల్లోని స్మార్ట్ ఫోన్లలో మారుమోగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల వారికి సమగ్రంగా అవగాహన కల్పించినట్టయితే వారు సామాజిక దూరం పాటించడంతో పాటు శానిటైజ్ చేసుకోవడం వంటివి చేస్తుంటారని అధికారులు భావిస్తున్నారు. పల్లె జనానికి అర్థం అయ్యే రీతిలో వారిని ఆకర్షించే పద్ధతిని ఎంచుకుంటే అన్ని విధాల సఫలం అవుతామని భావించే ఈ నిర్ణయం తీసుకున్నారు సిరిసిల్ల జిల్లా అధికారులు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను నేటికీ ఒగ్గ కథ ప్రభావితం చేస్తుందని గమనించే తామీ నిర్ణయం తీసుకున్నామని డీపీఆర్వో మామిల్ల దశరథం తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా పల్లె జనం ఇళ్లకే పరిమతం అవుతున్నారని తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుండి బయటకు వస్తే సమాజంలో ఎలా ఉండాలో వివరించేందుకు వారికి అర్థం అయ్యేవిధంగా ఉంటుందనే ఒగ్గుకథ బాణిలో మరింత ప్రచారం చేస్తున్నామని చెప్పారు.
‘వండర్ ఫుల్’ అంటూ..కేంద్ర మంత్రి కితాబు..
సిరిసిల్ల జిల్లా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎంచుకున్న ఒగ్గుకథ విధానాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు సిరిసిల్ల కలెక్టర్ ట్వీట్‌ను చూసి రీ ట్వీట్ చేసిన ఆయన వండర్ ఫుల్ అంటూ కితాబిచ్చారు. గ్రామీణ ప్రజలకు అర్థం అయ్యే రీతిలో చేపట్టిన ఈ కార్యక్రమం వారిని చైతన్యవంతుల్ని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags: corona virus, covid 19, awareness programme, oggu artists