- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసన్నా.. నీకు సలామన్నా!
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతోంది. ఆ భయంకరమైన భూతం మన దేశ గడపను తొక్కడమే కాదు.. అది ఇప్పుడు విలయతాండవం సృష్టిస్తున్నది. మన దేశవాసులు సుమారు వెయ్యికిమందికి పైగా దాని కోరకు చిక్కి ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురు చనిపోయారు. అంతేకాదు.. ఇంకా చాేలామందే దాని బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మహమ్మారి వైరస్ ను ఎలాగైనా కట్టడి చేయాలన్న ఉద్దేశ్యంతో పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మొదటగా కర్ఫ్యూను విధించాయి. ఆ తదనంతరం నుంచి లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. కరోనాతో జరుగుతున్న ఈ యుద్ధంలో డాక్టర్లు, నర్సులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, నాయకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న సేవలు మరువలేనివి.
అయితే.. ఇందులో భాగంగా పోలీసుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతటి ఆపత్కాల సమయంలో పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివి. వారంతా కూడా తమ శక్తికి మించి కరోనాతో జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములవుతున్నారు. ఆఖరికి తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ వారు సేవలందిస్తున్నారు. ఏ మాత్రం కూడా కరోనాకు భయపడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యం విధులు నిర్వర్తిస్తున్నారు.
సాధారణ సమయంలోనే ఏ సమయంలో ఏం జరిగినా కూడా పోలీసులే మొదటగా ఉండాల్సింది. దీంతో వాళ్లకు కత్తి మీద సాములా ఉంటుంది. కానీ, ప్రస్తుత సమయంలో వాళ్ల విధుల గురించి చెప్పనక్కర్లేదు. కరోనాను కట్టడి చేస్తున్న ఈ యుద్ధంలో అత్యంత మిన్న భాగం పోలీసులదే.
ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ నేపథ్యంలో పలువురు వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి రోడ్ల వెంట తిరుగుతున్నారు. అయితే వారందరికీ కూడా సర్ధిచెప్పి ఎవ్వరి ఇళ్లకు వారిని పంపిస్తున్నారు. ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా 24 గంటలపాటు సేవలందిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కాబట్టి వారికి తీరికనేదే లేకుండా పోయింది.
రోడ్లపైనే భోజనం
ప్రస్తుత ఆపత్కాల సమయంలో 24 గంటలపాటు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆఖరికి తినడానికి సైతం సమయం కూడా లేకుండా పోయింది. దీంతో విధులు నిర్వర్తిస్తూనే రోడ్లపైనే ఎక్కడో ఒక చోట మూలన భోజనం చేస్తున్నారు. మరికొంతమంది పోలీసులకైతే భోజనం అందడంలేదు. అయినా కూడా ఏ మాత్రం వెనక్కి తట్టకుండా తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు.
తానేమో ఇంటి బయట.. పిల్లలేమో ఇళ్లు లోపల..
చాలా మంది పోలీసులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే.. నిత్యం రోడ్ల వెంటే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది కాబట్టి ఆ వైరస్ పోలీసులకు సోకే అవకాశం లేకపోలేదు. అది ఏ రూపంలో ఎవ్వరిని చేరుతోంది ప్రస్తుతం అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి భయాందోళన సమయంలో కూడా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. అందుకోసమే వారంతా వారి ఇళ్లలో వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా సామాజిక దూరం పాటిస్తున్నారు. పిల్లలనైతే చాలా దూరం నుంచే చూస్తున్నారు. నిజంగా ఈ పరిస్థితిని తలచుకుంటే మనకు చాలా బాధేస్తుంది. కరోనా కట్టడిలో భాగంగా వాళ్లంతా పలు జాగ్రత్తలు తీసుకుంటూ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. అందుకే మనమంతా కూడా పోలీసుల సేవలను కొనయాడాల్సిందే.
Tags: police, duty, on roads, family, childrens