- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. శాలరీ ఎంతో తెలుసా..?
దిశ, తెలంగాణ బ్యూరో : కాంట్రాక్ట్ పద్ధతిన వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనికి గౌరవ వేతనాలను సైతం ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణం డాక్టర్లను, నర్సులను, లాబ్ టెక్నీషియన్లను, పారామెడికల్ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మూడు నెలల పాటు నియమించుకునేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరికి గౌరవ వేతనాన్ని ఖరారు చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వీరిని నియామకం చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే ఎంతకాలం పని చేయాలనేది మాత్రం స్పష్టం చేయలేదు. వైద్యారోగ్య శాఖ నుంచే వీరిని నియమించుకోనున్నారు.
వేతనాలు ఇవే
కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే స్పెషలిస్టు మెడికల్ఆఫీసర్కు రూ. లక్ష చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లించనున్నారు. అదే విధంగా ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్‌కు రూ. 40 వేలు, ఆయుష్మెడికల్ ఆఫీసర్‌కు రూ. 35వేల చొప్పున వేతనం ఇవ్వనున్నారు. స్టాఫ్ నర్స్‌కు రూ. 23వేలు, ల్యాబ్టెక్నీషియన్స్కు రూ. 17 వేలచొప్పున గౌరవ వేతనాన్ని ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.