సమాజంలో మందులేని మహమ్మారులు

by Anukaran |
సమాజంలో మందులేని మహమ్మారులు
X

దిశ, వెబ్‌డెస్క్ : 2020లో కొవిడ్ భూతం సృష్టించిన భయోత్పాతాన్ని కళ్లారా చూశాం. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కాగా కొవిడ్‌ కంటే ముందొచ్చిన ఎన్నో భయంకరమైన వ్యాధులకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాక్సిన్లు తీసుకొచ్చారు. కానీ ఈ సమాజాన్ని చూస్తుంటే.. ప్రపంచాన్ని ఎప్పటినుంచో పట్టి పీడిస్తున్న కొన్ని మహమ్మారులకు మాత్రం ఇక ఎప్పటికీ వ్యాక్సిన్ రాదేమో! అన్న అనుమానం కలుగుతోంది. ఇంతకీ ఆ భయంకరమైన వ్యాధులేంటంటే..

మారిటల్ రేప్ అండ్ డొమెస్టిక్ వయొలెన్స్:

భర్త.. తన భార్యను రేప్ చేస్తే ఇండియాలో న్యాయమే. ఈ మాట వింటే మహిళల వెన్నులో వణుకు పుట్టొచ్చు కానీ, చట్టం మాత్రం ఏం చేయదు. భారతదేశంలోని వివాహిత మహిళల్లో మూడింట రెండొంతుల మంది (15-49 వయసు) రేప్‌కు గురికావడమో, గృహహింసకు బలవడమో జరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ఈ లాక్‌డౌన్ సయమంలోనే.. అంటే మార్చి 25 నుంచి మే 31 వరకు 1477 డొమెస్టిక్ వయొలెన్స్ కేసులు మన దేశంలో నమోదయ్యాయి. వీటిల్లో ఎక్కువగా యూపీ, బీహార్, రాజస్థాన్, హర్యానాల్లో చోటుచేసుకున్నాయి. నిజానికి వీటిని అరికట్టేందుకు గృహహింస చట్టాలు కఠినంగానే ఉన్నా, వాటి అమలులోనే లోపాలు దాగున్నాయి. లంచాలు, లాబీయింగ్‌తో దోషులు అవలీలగా తప్పించుకుంటున్నారు.

రేప్స్ :

మనదేశంలో ప్రతి 16 నిమిషాలకో రేప్ జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని వందల రేప్‌లు జరుగుతున్నాయి. కానీ అమ్మాయిలకు సత్వర న్యాయం ఎక్కడా జరగడం లేదు. కఠిన నిబంధనలు అమలు చేస్తున్న దేశాల్లో మాత్రం రేప్‌లు నమోదు కావడం లేదు. దీన్ని బట్టి చూస్తే.. కఠిన చట్టాలు అమలు చేస్తే, ఈ పరిస్థితిలో మార్పు రావొచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు మగపిల్లలకు ఆడవాళ్లను గౌరవించాలనే విజ్ఞతను ముందు నుంచే నేర్పిస్తే, అనూహ్య మార్పును చూడొచ్చు.

క్యాస్టిజం :

కుల జాడ్యం మానవ నరనరాల్లో ఎంతగా వేళ్లూనుకుపోయిందో వేరే చెప్పనక్కర్లేదు. పరువు హత్యలు, కుల రాజకీయాలు, రిజర్వేషన్లు అన్నింటికీ మూలం ‘క్యాస్టిజం’. కుల వ్యవస్థను నిర్మూలించాలని, కుల రహిత సమాజం కోసం పోరాడాలని స్వాతంత్ర్యం రాకముందు నుంచే మన దేశంలో ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నా ఇప్పటికీ అందులో మనం సాధించింది శూన్యమనే చెప్పుకోవాలి. ఇంకెన్ని కరోనాలు మానవుని ఉనికిని దెబ్బతీయడానికి వచ్చినా, క్యాస్టిజాన్ని దెబ్బతీసే వ్యాక్సిన్లు మాత్రం పుట్టలేవన్నది కఠోర వాస్తవం.

కలరిజం/రేసిజం

జాతి వివక్ష కూడా ప్రపంచాన్ని పీడీస్తున్న సమస్యల్లో ఒకటి. అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పటికీ జాతి వివక్ష పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికీ మొన్న అమెరికాలో ఫ్లాయిడ్ హత్య రేసిజం విషబీజాలను తెరమీదకు తీసుకురాగా, ప్రస్తుతం భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ టెస్టు మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న వార్న్, భారత ఆటగాడు ఛటేశ్వర్ పుజారాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జాతి వివక్షకు నిదర్శనం. ఈ పదాన్ని ఉపయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలోనే కౌంటీ క్రికెట్ నిర్వాహకులు నిర్ణయించారు. ఇలా వందల సంవత్సరాల నుంచి రేసిజం వల్ల ఎంతోమంది వివక్షకు గురవుతున్నారు.

ఇవే కాదు, హ్యుమన్ రైట్ వయొలేషన్స్, అటాక్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్, ట్రోలింగ్ ఆన్ ఉమెన్స్, హానర్ కిల్లింగ్స్ వంటి వాటికి కూడా నో వ్యాక్సిన్.

Advertisement

Next Story

Most Viewed