ముట్టుకోకుండా డోర్‌బెల్ కొట్టండి

by vinod kumar |
ముట్టుకోకుండా డోర్‌బెల్ కొట్టండి
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ తాకిడి ద్వారా అధికంగా వ్యాపిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా ముట్టుకునే రోజువారీ స్థానాల్లో డోర్‌బెల్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ముట్టుకోకుండా మోగే డోర్‌బెల్‌ని ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు కనిపెట్టాడు. అక్కడి మోడర్న్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న సార్థక్ జైన్ ఈ డోర్‌బెల్ తయారుచేశాడు.

సోషల్ డిస్టెన్సింగ్ దృష్టిలో పెట్టుకుని తనకు ఈ ఐడియా అభివృద్ధి చేసినట్లు సార్థక్ తెలిపాడు. ఈ డోర్‌బెల్‌లో ఉన్న అల్ట్రాసోనిక్ సెన్సార్, డోర్‌బెల్ ముందు 50 సెంటీమీటర్ల దూరంలో నిల్చుంటే పసిగట్టి అలారం మోగిస్తుంది. మోడర్న్ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులకు శాస్త్రజ్ఞానం పెంపొందించడానికి అటల్ టింకరింగ్ లాబోరేటరేస్ ప్రోగ్రామ్ నడుస్తోంది. ఇందులో పాల్గొన్న ఇతర విద్యార్థులతో చర్చించి చాలా విషయాలు నేర్చుకున్న సార్థక్ ఈ డోర్‌బెల్ తయారుచేశాడు. ఇదే ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న ఇతర విద్యార్థులు కూడా కరోనా నేపథ్యంలో తమ ఇన్నోవేటివ్ ఐడియాలతో మాస్కులు, సూట్లు, వెంటిలేటర్లు తయారుచేస్తున్నారు.

Tags: corona, covid, contactless doorbell, delhi, modern public, ultra sonic sensor, Atal tinkering bell

Advertisement

Next Story

Most Viewed