వినియోగదారుల డిమాండ్ పుంజుకునేది రెండో త్రైమాసికంలోనే

by Harish |
వినియోగదారుల డిమాండ్ పుంజుకునేది రెండో త్రైమాసికంలోనే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి వినియోగదారుల డిమాండ్ బలంగా పుంజుకుంటుందని ప్రముఖ రిటైల్ సంస్థ ట్రెంట్ ఛైర్మన్ నోయెల్ ఎన్ టాటా అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం అనిశ్చిత పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ దేశీయ వృద్ధికి కీలకమైన అధిక జనాభా, పెరుగుతున్న తలసరి ఆదాయం, వినియోగం వంటి అంశాల కారణంగా భారత్ బలమైన వృద్ధి పథానికి చేరుకుంటుందని తాజా వార్షిక నివేదికలో ఆయన తెలిపారు.

ప్రస్తుత మహమ్మారి నుంచి ఎంత కాలంలో బయటపడతామనేది ఊహించలేమని, సంక్షోభ పరిస్థితులను అధిగమించే సమయంలో వినియోగదారుల డిమాండ్ బలంగా పుంజుకునే సంకేతాలను చూడగలమని, బహుశా ఇది రెండో త్రైమాసికంలో ఉండొచ్చని ఆయన వివరించారు. ఈ సంక్షోభం వల్ల వ్యాపారాలు కొత్త నైపుణ్యాలకు, ముఖ్యంగా ఈ పరిస్థితులకు అనుగుణంగా ఉండే స్థాయిలో పటిష్టతను సాధిస్తాయని నోయెల్ ఎన్ టాటా పేర్కొన్నారు. ట్రెంట్ సంస్థ భిన్నమైన బ్రాండ్లను, కొత్త స్టోర్లను, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వేగవంతంగా కార్యకలాపాలను నిర్వహించడంపై దృష్టి సారిస్తోందన్నారు.

Advertisement

Next Story