నత్తనడకన కొనసాగితే కఠిన చర్యలు

by Shyam |
నత్తనడకన కొనసాగితే కఠిన చర్యలు
X

దిశ, ఆందోల్: నిర్ధేశించిన సమయానికి జిల్లాలో రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరా రెడ్డి సూచించారు. సోమవారం మండల పరిధిలోని సంఘంపేట, చింతకుంట గ్రామాల్లో చేపడుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గ్రామాల్లో నత్తనడకన పనులను కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story