ఏరువాక ఉత్సవం.. చెక్ డ్యాం నిర్మాణం ప్రారంభం

by Shyam |
ఏరువాక ఉత్సవం.. చెక్ డ్యాం నిర్మాణం ప్రారంభం
X

దిశ, రంగారెడ్డి: తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్​ మండలంలోని జీవని గ్రామంలో కాగ్నా నదిపై భారీ చెక్​ డ్యాం నిర్మిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ చెక్​ డ్యాంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాండూర్​ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాగ్నా నదిపై రూ.8కోట్ల 74లక్షలతో నిర్మించే చెక్​ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురష్కరించుకొని మంత్రి మొక్క నాటారు. బషీరాబాద్​ మండలంలోని నవల గ్రామంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవంలో భాగంగా ఎండ్లబండి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… రైతుల ప్రయోజనం వైపే సీఎం కేసీఆర్ ఆలోచన విధానం ఉంటుందని అన్నారు. నియంత్రిత పంటల సాగు చేస్తే రైతుకు గిట్టుబాట ధర లభిస్తుందన్నారు. ఏ ప్రభుత్వం రైతుకు భరోసా కల్పించే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలకుడు రైతు కావడంతో రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కావడంతోనే రైతు సంక్షేమంపై దృష్టి సాధించారని తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మెన్ మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story