- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమిషనర్‌కు లేఖ రాసిన శ్రీధర్ బాబు.. విషయం ఏంటంటే..
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో మంజూరు అయిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని మంథని ఎమ్మెల్యే , మాజీమంత్రి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ని,పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ని లేఖ ద్వారా కోరారు. ఈ నూతన భన నిర్మాణం కోసం మంథని నుంచి ఏగ్లాస్ పూర్ వెళ్లే మెయిన్ రోడ్డుపై నూతన ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూములైన సర్వే నెంబర్ 315లో ఉన్న 2ఎకరాల 20 గుంటల భూమిని సర్వే చేసి సత్వరమే వైద్య ఆరోగ్యశాఖకు స్థలాన్ని బదిలీ చేసి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.
నూతనంగా నిర్మాణం అవుతున్న ప్రభుత్వ మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రికి ఎదురుగా ఉన్న పోచమ్మ గుడి దగ్గర్లోని సర్వే నెంబర్ 315 లో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇప్పటికే నిధులు మంజూరైనవి. ఈ నిధులను ఆసుపత్రి భవన నిర్మాణం కోసం కేటాయింపు చేస్తే ఆసుపత్రి వ్యవస్థ అంతా ఒకేచోట ఉండడం మూలంగా వైద్య సిబ్బంది అందరూ ఒకేచోట ఉండడం,అదేవిధంగా భవిష్యత్ లో పట్టణీకరణ పెరిగిన ప్రజలకు సరియైన సేవలు అందుతాయని తెలిపారు. ఈ దిశగా అట్టి స్థలంపై సర్వే చేయించి, స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించే చర్యలు సత్వరమే చేసి నూతన ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టే చర్యలు తీసుకోవాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు లేఖలో కోరారు.