- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 అంతస్తులతో ఎంసీహెచ్.. హన్మకొండ, వరంగల్ జిల్లా పేర్లు మార్పు : ఎర్రబెల్లి
దిశ ప్రతినిధి, వరంగల్ : దేశమే గర్వించేరీతిలో వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నూతనంగా మల్టీసూపర్ స్పెషాలిటీ భవానాన్ని 30 అంతస్తులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతోందని మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైల్‌ను కూల్చి ఎంజీఎం ఎంసీహెచ్‌ను 24 అంతస్తులతో నిర్మిస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 6 అంతస్తులను పెంచి మొత్తం 30 అంతస్తులతో ఎంసీహెచ్ నిర్మాణం ఉండబోతోందని మంత్రి దయాకర్‌రావు వెల్లడించడం గమనార్హం.
శనివారం ఉదయం హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెనాడాలో కూడా ఇంత పెద్ద ఆసుపత్రి లేదని, దేశంలో కూడా మరెక్కడా లేని విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంసీహెచ్ నిర్మాణం ఉండబోతోందని అన్నారు. అద్భుతమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్మిస్తోందని అన్నారు. జైలు స్థలం కూల్చి.. ఆసుపత్రి నిర్మాణం చేపడతామని చెప్పగానే బీజేపీ నేతలు కోర్టులను ఆశ్రయించి అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. విజయశాంతి విమర్శలు అర్థరహితమంటూ పేర్కొన్నారు.
వరంగల్ అభివృద్ధిపై వ్యూతో కేసీఆర్..
వరంగల్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూతో ఉన్నారని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కరోనా సమయంలో వరంగల్ ఎంజీఎం ద్వారా వేలాదిమంది రోగుల ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడిందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రప్రభుత్వం సరైన సహకారం అందించకుండా కక్షపూరితంగా వ్యవహరించినా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌తో పాటు మందులను, టెస్ట్ కిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచి కరోనా కట్టడిలో విజయవంతమైందని తెలిపారు.
ఇందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, డాక్టర్ల నుంచి ప్రభుత్వానికి చక్కటి సహకారం అందిందని, ఇందుకు వారికి కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం కోసం మూమునూరు వద్ద 100 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందని, దీన్ని డిజైన్ రూప కల్పనలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా జైలు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన చేయడం జరుగుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
వరంగల్, హన్మకొండ జిల్లాలు..
హన్మకొండ, వరంగల్ జిల్లాలకు పేర్లకు సంబంధించి కేసీఆర్ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని, జనం అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రూరల్ జిల్లాకు వరంగల్‌ను కేంద్రంగా చేసి..అర్బన్ జిల్లాకు హన్మకొండను కేంద్రంగా చేస్తూ వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పేర్లు మార్చేందుకు నిర్ణయించినట్లుగా తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల పేర్లు కొనసాగాలని, ఈ ప్రాంతంతో సంబంధంలేని వ్యక్తుల పేర్లను పెడితే జనంలో ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉందని మంత్రి దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లడంతో.. జనాభిప్రాయాన్ని గౌరవించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.