- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వనపర్తి దాడి ఘటన.. కానిస్టేబుల్ సస్పెన్షన్
లాక్‌డౌన్ నేపథ్యంలో కొడుకు కళ్ల ముందే తండ్రిపై విచక్షణారహితంగా దాడిచేసిన కానిస్టేబుల్‌ను వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు సస్పెండ్ చేశారు. బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతని కుమారుడితో ముచ్చటించారు. బుధవారం సాయంత్రం వనపర్తిలో ఓ వ్యక్తి తన కుమారుడితో కలసి ద్విచక్రవాహనంపై పలుమార్లు రాకపోకలు సాగించాడు. లాక్‌డౌన్ సమయంలో ఇలా తిరగడం సబబు కాదని, అంతేకాకుండా బైక్‌పై 14 పెండింగ్ చలాన్లు ఉన్నాయని సదరు వ్యక్తిని కానిస్టేబుల్ ప్రశ్నించాడు. అక్కడితో ఆగకుండా కొడుకు ముందే ఆ వ్యక్తిని కింద పడేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరస్ అయింది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించకూడదని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎస్పీ అపూర్వరావు దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: wanaparthy,sp apoorva rao, constable suspended