- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్టరీ : అత్యాచారం చేసిన అతడు.. ఆమె మృతి
దిశ, వెబ్ డెస్క్ : ఒంటరి మహిళపై కన్నేసిన ఓ కానిస్టేబుల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని నమ్మిన ఆమె.. తల్లిదండ్రులను వదిలి ప్రత్యేకంగా రూం అద్దెకు తీసుకోని ఆ కామ కానిస్టేబుల్ కు సర్వం అర్పించుకుంది. చివరకు అతడు ముఖం చాటేయడంతో మోసపోయనని గ్రహించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
ఉత్తరప్రదేశ్ రాష్ర్టం కాన్పూర్ లోని దిబియాపూర్ కు చెందిన మహిళ ఈటావాహకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులకే భర్త చనిపోవడంతో వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆ సమయంలో దెవ్ కాళీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న పతేపూర్ కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. ఇద్దరు కలిసి బ్రహ్మనగర్ లో రూం అద్దెకు తీసుకోని గడిపారు. సదరు మహిళ పెళ్లి చేసుకోవాలని కోరగా.. కానిస్టేబుల్ నిరాకరించాడు.
దీంతో మోసపోయనని గ్రహించిన ఆమె అతడు పని చేసే దిబియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె నవంబర్ 2 ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించిన రెండు రోజులకే కానిస్టేబుల్ ఈతావాహ నుంచి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో వారిద్దరి మృతిపై స్థానికులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.