తృటిలో తప్పిన ప్రమాదం.. వృద్ధురాలిని కాపాడిన కానిస్టేబుల్ హరి

by Sridhar Babu |
తృటిలో తప్పిన ప్రమాదం.. వృద్ధురాలిని కాపాడిన కానిస్టేబుల్ హరి
X

దిశ, ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. 14 నెంబర్ బస్తీకి చెందిన రామ్ కాళి మోచి(67) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు కాలుజారి సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయింది. ఈ ఘటన ఇల్లందు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది.

ఈ క్రమంలోనే పిటిషన్ ఇంక్వైరీ నిమిత్తం అటుగా వెళ్తున్న భూక్య హరి అనే కానిస్టేబుల్ వృద్ధురాలి కేకలు విని స్థానికుల సహాయంతో సెప్టిక్ ట్యాంక్ నుంచి ఆమెను బయటకు తీశారు. సకాలంలో వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ హరిని స్థానికులు, ఉన్నతాధికారులు ప్రశంసించారు. కాగా, భూక్య హరి ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో 25 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తు్న్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story