- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మహా’ సర్కార్‌పై కుట్ర జరుగుతోంది : సంజయ్ రౌత్
దిశ, వెబ్ డెస్క్ : సుశాంత్ మృతి కేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. మహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సుశాంత్ కేసులో నిజాన్ని కనిపెట్టేందుకు ముంబై పోలీసులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే, ‘సుశాంత్ సింగ్ మృతిపై బీహార్, ఢిల్లీ నడుపుతున్న రాజకీయం వెనుక మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ముంబై పోలీసులు సమర్ధత కలిగిన వారు. నిజం వెలికి తీయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు’ అని మీడియాతో సంజయ్ రౌత్ అన్నారు.
నిజం బయటకు రాకుండా కొందరు తెర వెనుక ఉండి స్క్రీన్‌ప్లే రచన చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. అందువల్లే వారు సీబీఐని ఓ పావులా ఉపయోగించుకుంటున్నారని.. మహారాష్ట్రపై కుట్ర పన్నుతున్నారని సంయత్ రౌత్ ఘాటుగా స్పందించారు. 40 నుంచి 50 రోజులుగా ఆ కేసుకు ఒక తుదిరూపం తెచ్చేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని వెనుక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. బీహార్ ప్రభుత్వం, బీహార్ నాయకులే దీని వెనుక ఉన్నారని శివసేన ఎంపీ ఆరోపించారు. ఇదిలాఉంటే సుశాంత్ మరణంపై శివసేన సీఎం ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే హస్తముందని కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.