- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హస్తం వద్దు..కారే ముద్దు
దిశ, నిజామాబాద్: ఎన్నికలు ఏవైనా, పార్టీల గుర్తులు ఎన్ని ఉన్నా.. అధికారం ఉంటేనే మనకు గుర్తింపు అనే లాజిక్‌ను రాజకీయ నాయకులు బాగా వంట బట్టించుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల కంటే అధికార పార్టీలో ఉన్న నాయకులకే పలుకుబడి, నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అదే లేనప్పుడు గెలిచి ఏం లాభం అనుకున్నారేమో? అందుకే కొందరు అధికార పార్టీ గుమ్మం తొక్కుతున్నారు.ఇప్పటికే చాలా మంది కారెక్కగా, తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పాలన, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్‌లోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఏర్గట్ల జెడ్పీటీసీ సభ్యులు గుల్లె రాజేశం టీఆర్ఎస్‌లో చేరినట్టు చెప్పారు.కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ పూర్ణానందం, ఎంపీటీసీ జక్కని మధు,సర్పం చ్ లావణ్య-గంగాధర్ పలువురు పాల్గొన్నారు.