- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వచ్చేది కాంగ్రెస్ రాజ్యమే : కాంగ్రెస్ యువ నాయకులు మధుసూదన్‌రెడ్డి
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం రాబోతుందని కాంగ్రెస్ యువ నాయకులు, రేవంత్ ప్రధాన అనుచరుడు చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని, మాయమాటలు చెప్పి దళితులను, బడుగు బలహీనవర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
కేవలం ఒక ఉప ఎన్నిక కోసం దళిత బంధు అంటూ పథకాన్ని తీసుకొచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండాల శివకృష్ణ గౌడ్, రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివ, భార్గవ్, నాని తదితరులు పాల్గొన్నారు.