కార్పొరేషన్‎పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

by Shyam |
కార్పొరేషన్‎పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
X

దిశ ప్రతినిధి, వరంగల్: త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో కార్పోరేషన్‎పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ నగరంలో తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం‌ జరిగింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ సమక్షంలో యాకుబ్ పాషా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. వరంగల్ మేయర్ బరిలో తన కూతురు సుష్మిత లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

Advertisement

Next Story