హుజురాబాద్‌లో కాంగ్రెస్​ టీం రెడీ

by Sridhar Babu |
Revanth-Huzurabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో హుజురాబాద్​ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ రంగంలోకి దిగుతోంది. దీనికోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన దూకుడును మరింత పెంచారు. రేవంత్​రెడ్డికి ఈ ఉప ఎన్నిక కీలకం కానుంది. ఇక్కడి ఫలితాలు హస్తం నేతల్లో జోష్​ పెంచడమే కాకుండా… ఆయా పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు, పార్టీని వీడిన నేతలు తిరిగి వచ్చేందుకు మార్గం కానుంది. గెలుపోటములు ఎలా ఉన్నా… హుజురాబాద్​లో ఓటు బ్యాంకును నిరూపించుకోవడం ఇప్పుడు రేవంత్​పై ఉన్న అతిపెద్ద టాస్క్​.

ఈ నేపథ్యంలో హుజురాబాద్​ ఉప ఎన్నికల కోసం ఇన్‌చార్జ్‌లను టీపీసీసీ ప్రకటించింది. హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా దామోదర రాజనర్సింహకు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఆయనకు ఈ బాధ్యతలను ఇస్తామని, అక్కడ అభ్యర్థిని ఎంపిక చేసే అంశాన్ని కూడా ఆయనపైనే వేశారు. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డితో సమన్వయం చేసుకుంటూ అక్కడి పరిణామాలపై ఫోకస్​చేయాల్సి ఉంటోంది.

హుజురాబాద్​కు సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌‌‌లు వ్యవహరించనున్నారు. ఇక హుజురాబాద్​సెగ్మెంట్లో రేవంత్​రెడ్డి త్వరలోనే పర్యటిస్తారని గాంధీభవన్​ వర్గాలు వెల్లడించాయి. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ముందుగా హుజురాబాద్​ప్రాంతంలో పర్యటించే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్​ పార్టీ నుంచి వీణవంక మండం ఇంచార్జీలుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలానికి మాజీ ఎమ్మెల్యే విజయ రమణరావు, రాజ్ ఠాగూర్​ మక్కాన్​సింగ్, హుజురాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్షణ్ కుమార్, హుజురాబాద్ టౌన్​కు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగారావు, ఇల్లంతకుంట మండలానికి నాయిని రాజేందర్​రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్ మండలానికి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యలను ఇంచార్జీలుగా నియమించారు. ఇక కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్​ ఉప ఎన్నికలపై సమాచారం కోసం దొంతి గోపిని నియమించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed