ఆ పార్టీ అధికార ప్రతినిధికి కరోనా

by vinod kumar |
ఆ పార్టీ అధికార ప్రతినిధికి కరోనా
X

ముంబయి: కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా వ్యాధి బారిన పడ్డాను. వచ్చే 10 నుంచి 12 రోజులు ముంబైలోని నా ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటాను. దయచేసి వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేయకండి. మనమందరం బలహీన స్థితిలో ఉన్నాం. తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ సంజయ్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed