పీసీసీ లొల్లి.. ఇవాళ ఢిల్లీకి కీలక నేతలు

by Shyam |
పీసీసీ లొల్లి.. ఇవాళ ఢిల్లీకి కీలక నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పీసీసీ పదవికి రాజీనామా చేశాక కాంగ్రెస్ పార్టీలో ఆ పోస్టుకు ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొంది. పీసీసీ రేసులో నేను ముందున్న అంటే నేను ముందున్న అని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ ఢిల్లీ అధినాయకత్వం ముందు ఎవరి పేరును సూచించారో తెలిక సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగెస్ లీడర్లు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తినకు వెళ్లేవారిలో భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నట్లు సమాచారం.

వీరంతా పీసీసీ పీఠంపై ఏకపక్ష నిర్ణయంతో అధినాయకత్వాన్ని కలవనున్నారు.తమలో ఎవరికీ పీసీసీ పదవి కట్టబెట్టిన సమ్మతమే కానీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడితే చూస్తూ ఊరుకోమని సీనియర్ లీడర్లు గరం అవుతున్నారు. కాగా, హస్తినకు వెళ్లిన నాయకుల్లో పీసీసీ పీఠం ఎవరికీ దక్కుతుందో తెలియాలంటే మరికొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story