నేను అదే అడుగుతున్నా….

by Anukaran |   ( Updated:2020-09-02 09:37:57.0  )
నేను అదే అడుగుతున్నా….
X

దిశ వెబ్ డెస్క్: దేశంలో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. తాను ఆర్థిక మంత్రి గా ఉన్నప్పుడు గుజరాత్ సీఎం హోదాలో మోడీ చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ విమర్శలు చేశారు. ఇప్పుడు తాను అదే అడుగుతున్నాని సమాధానం చెప్పాలంటూ ట్వీట్ చేశారు.

యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ట్విట్టర్ వేదికగా చిదంబరంపై మోడీ ఘాటైన విమర్శలు చేశారు. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందనీ, యువత ఎంప్లాయిమెంట్ కోరుకుంటోందన్నారు. చిదంబరం గారు రాజకీయాలు మాని ఉద్యోగ కల్పన, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంపై దృష్టి సారించడంటూ ట్వీట్ చేశారు. కాగా తాజాగా చిదంబరం అదే ట్వీట్ ను స్క్రీన్ షాట్ చేసి తాను ఇప్పుడు అదే అడగదలుచుకున్నానని అంటు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story