- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గజ్వేల్ సభ.. కేసీఆర్ పాలనపై చార్జ్‌షీట్ విడుదల
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఏడేళ్లుగా దొరలపాలన నడుస్తోందని కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ విమర్శించారు. గజ్వేల్‌లో జరుగుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో దామోదర మాట్లాడుతూ.. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో చేసిన మోసాలపై చార్జిషీట్ విడుదల చేశారు.
ఈ చార్జ్‌షీట్‌లో ‘‘ప్రజాస్వామ్య తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి చేస్తా… లేకుంటే తల నరుక్కుంటా అని చెప్పి కేసీఆర్ మోసం చేసిండు. దళితులందరికీ మూడెకరాల భూమి ఇచ్చి రైతులను చేస్తానని చెప్పి కేవలం 6వేల మందికి ఇచ్చి చేతులెత్తేసి రెండో మోసం చేశారు. ఇళ్లులేని ప్రతి పేద, దళితులకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఇప్పటివరకూ 30 వేల ఇళ్లు కట్టించి మోసం చేసిన ఘనత కేసీఆర్‌దే. ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్.. 7ఏళ్లలో 55వేల ఉద్యోగులను భర్తరఫ్ చేసిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌తో ప్లాన్డ్ బడ్జెట్ పెట్టాలని చెప్పి దాదాపు 60వేల కోట్లు పక్కదారి పట్టించి కేసీఆర్ మోసం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి దళిత, గిరిజనులను మోసం చేశారు.
ప్రతి పేద విద్యార్థి, విద్యావంతులు కావాలని ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొస్తే కేసీఆర్ ప్రభుత్వం దానిని సరిగా అమలు చేయడం లేదు. సబ్సిడీ లోన్లు పక్కనపెట్టేశారు. మహిళా సంఘాలకు పావుల వడ్డీ, వడ్డీలేని రుణాలపై వడ్డీ కూడా కట్టలేకపోతోంది. అమ్మహస్తం కింద 9 తినుబండారాలు, సన్నబియ్యాన్ని కాంగ్రెస్ పంపిణీ చేసేది, టీఆర్ఎస్ వాటిని వదిలేసింది. రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది కవులు రైతులకు గుర్తింపు లేదు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా దళితుడ్ని చేసి మూడేళ్లకే బర్తరఫ్ చేసిన ఘనత కేసీఆర్‌ది మాత్రమే’’ అని చార్జ్‌షీట్ విడుదల చేశారు.