ఆంధ్రప్రదేశ్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్

by srinivas |   ( Updated:2021-06-27 07:52:42.0  )
Congress Party AP In-Charge Woman Chandi
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడతల వారీగా నియామకాలు చేపట్టింది. రెండు రోజుల క్రితం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని ప్రకటించిన ఏపీఐఐసీ తాజాగా పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు పూర్తవ్వడంతో ఇప్పుడు ఏపీపై దృష్టి సారించింది. ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సోమ, మంగళవారం రాష్ట్ర పరిస్థితులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలతో విజయవాడలో భేటీ అవుతారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో దాన్ని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కమిటీలలో మార్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలుగు రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ అధికార వైసీపీపై పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed