- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంజాబ్ పురపోరులో బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్
చండీగఢ్ : పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మెజార్టీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. శిరోమణి అకాలీదల్, బీజేపీ పార్టీలకు రిక్తహస్తం ఎదురైంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు, శిరోమణి అకాలీదల్, బీజేపీ బంధానికి తెరపడిన తర్వాత పంజాబ్ రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. చట్టాలకు రెఫరండంగా అధికార కాంగ్రెస్‌తోపాటు శిరోమణి అకాలీదల్, ఆమ్ అద్మీ పార్టీలు ప్రచారం చేశాయి. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలకంగా మారాయి. ఆదివారం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు, 109 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా బుధవారం ఫలితాలు వెలువడ్డాయి. ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరింటిలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ రాగా, మరో స్థానంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బటిండా, హోషియర్‌పూర్, ఖపుర్తలా, అబొహర్, బంటాలా, పటాన్‌కోట్ స్థానాల్లో విజయం సాధించింది. దాదాపు 53 ఏండ్ల తర్వాత బటిండా మున్సిపల్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం. పటాన్‌కోట్ కార్పొరేషన్‌ను బీజేపీ కోల్పోయింది. మొగ కార్పొరేషన్‌లో ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొత్తం 50 స్థానాలకు కాంగ్రెస్ 20, శిరోమణి అకాలీదల్ 15, మిగతా చోట్ల ఇతరులు విజయం సాధించారు. కానీ, కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మొహాలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు వార్డులకు రీపోలింగ్ నేపథ్యంలో గురువారం ఫలితాలు వెలువడనున్నాయి. 109 మున్సిపాలిటీలకుగాను 78 స్థానాల్లో కాంగ్రెస్, ఐదు స్థానాల్లో శిరోమణి అకాలీదల్, 14 చోట్ల ఇతరులు గెలుపొందారు. మరో 12 మున్సిపాలిటీ పరిధిలో కౌంటింగ్ కొనసాగుతున్నది. మాల్వ పరిధిలోని ఫిరోజ్‌పూర్, జిరా రెండు మున్సిపాల్టీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తమ కంచుకోటలైన జలాల్‌బాద్, అరిన్వాలా, ఫాజిల్కాలను శిరోమణి అకాలీదల్ కోల్పోయింది. ఫాజిల్కాలోని 25 వార్డుల్లో పోటీ చేసి బీజేపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. మాన్సా పరిధిలో చాలా మున్సిపాలిటీల్లో స్వతంత్రులు అత్యధిక స్థానాల్లో గెలిచారు. లూథియానాలోని ఖన్నా, జాగ్రోన్, సమ్రాలా, రాయ్కోట్, డోరాహా, పాయల్, సహనేవాల్ మున్సిపాలటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. నయాగావ్ మినహా మోహాలి పరిధిలో అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సంగ్రూర్, బర్నాలా, పాటియాలా స్థానాలను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్నది. సిట్టింగ్ స్థానం పటాన్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటమి బీజేపీకి అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. కేవలం 11 వార్డుల్లో మాత్రమే కాషాయ పార్టీ విజయం సాధించగా, అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. మజా రీజయన్ పరిధిలో 13 మున్సిపాలిటీలను కాంగ్రెస్, రెండింట్లో శిరోమణి అకాలీదల్ విజయం సాధించగా, ఖాడియన్ మున్సిపాలిటీ కౌంటింగ్ కొనసాగుతున్నది.
ప్రతిపక్షాలు తిరస్కరణకు గురయ్యాయి : సీఎం
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తిరస్కరణకు గురయ్యయాని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. మేం స్పష్టంగా గెలిచిన ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నష్టం చేస్తాయని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరే చట్టాలు, ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలిని తిరస్కరిస్తున్నట్లు మున్సిపల్ ఎన్నికలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు.