కాంగ్రెస్‌కు మరోదెబ్బ

by Shamantha N |
కాంగ్రెస్‌కు మరోదెబ్బ
X

అహ్మదాబాద్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారు దాదాపుగా కుప్పకూలే దశకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, గుజరాత్‌లోనూ కాంగ్రెస్‌కు మరో షాక్ ఎదురుకాబోతున్నది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. వారి రాజీనామా లేఖలు స్పీకర్‌కు చేరాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 103మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ 73మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది. రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకుగాను రెండు స్థానాలను బీజేపీ సులువుగా గెలవచొచ్చు. కాగా, ఇంకా రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశముంది. కానీ, బీజేపీ రెండుకు బదులు మూడు రాజ్యసభ సభ్యులకోసం నామినేషన్ వేసింది. అయితే, మూడో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవాలంటే.. 111 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికే బీటీపీ నుంచి ఇద్దరు, ఎన్‌సీపీ ఎమ్మెల్యే ఒకరు బీజేపీకి మద్దతునిస్తున్నారు. ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకి అవసరమున్నది. ఈ నేపథ్యంలోనే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు రాజీనామా చేశారు.

Tags : kamal nath, gujarat, rajya sabha elections, congress mla, resignation

Advertisement

Next Story