టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే.. కేసీఆర్ ఇంటి కుక్కలకే విలువెక్కువ: జగ్గారెడ్డి

by Shyam |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే.. కేసీఆర్ ఇంటి కుక్కలకే విలువెక్కువ: జగ్గారెడ్డి
X

దిశ, మెదక్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ పెంపుడు కుక్కలకు ఉన్న విలువ.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు లేదని, ప్రశ్నిస్తే మళ్లీ టికెట్ రాదని భయపడుతున్నారని జగ్గారెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. మన రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్ దొరకదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో నీటి సమస్యపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరెత్తడం లేదని, మంజీరాకు వచ్చే నీళ్లను మంత్రి హరీశ్ రావు తరలించుకుపోయారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లతో మంజీరా నింపుతామన్నారని, మూడేళ్లైనా రాలేదని దుయ్యబట్టారు. హరీశ్ రావు సంగతేంటో సంగారెడ్డిలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. జూన్ 4న తమ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంజీరా డ్యామ్‌ను సందర్శిస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.

Advertisement

Next Story