- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భవతీ.. భిక్షాందేహి.. అంటూ జోలె
దిశ, హుస్నాబాద్: ప్రభుత్వ తీరును నిరసిస్తూ, ఆదివారం హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అంబులెన్స్ బాగు చేసేందుకు భవతీ.. భిక్షాందేహి.. అంటూ జోలె పట్టి భిక్షాటన చేశారు. అనంతరం పార్టీ నాయకులు అక్కు శ్రీనివాస్ మాట్లాడుతూ… కరీంనగర్, వరంగల్, జనగాం, సిద్దిపేట వంటి నాలుగు జిల్లాలకు కేంద్ర బిందువైన హుస్నాబాద్ నియోజకవర్గానికి రెండు అంబులెన్సులు ఉండగా, ప్రస్తుతం ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉందన్నారు. జాతీయ గ్రామీణా ఆరోగ్య మిషన్ కింద గత ప్రభుత్వ హయంలో హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి అంబులెన్సులను కేటాయించారు.
గత కొంతకాలంగా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఏర్పడడంతో అంబులెన్సులు ములన పడ్డాయన్నారు. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలకు వినపత్రాలిచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆసుపత్రికి శాశ్వత అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీల నాయకులు 14 రోజులుగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నా… ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో భిక్షాటన చేసి అంబులెన్స్ కొనుగోలు చేసి ప్రభుత్వ సుపత్రికి అందిస్తామన్నారు. నూతన అంబులెన్స్ కొనుగోలు కోసం కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రూ.50 వేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి రూ. 50 వేల విరాళం ప్రకటించారు.