పాలకవర్గంలో అలజడి.. చేయి జారుతుందా..!?

by Shyam |   ( Updated:2021-03-14 20:15:21.0  )
పాలకవర్గంలో అలజడి.. చేయి జారుతుందా..!?
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌:తుర్క‌యంజాల్ మున్సిపాలిటీలో అధికార పీఠంలో క‌ద‌లిక‌లు మొద‌ల‌వుతున్నాయి. ప‌లువురు కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డిని క‌లిసి బేర‌సారాలు న‌డిపిన‌ట్టు స్థానిక జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. చైర్ ప‌ర్స‌న్ భ‌ర్త మ‌ల్‌రెడ్డి రాంరెడ్డికి ఎల్బీన‌గ‌ర్ నియో జ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం తో ఎలాగైనా అక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరాల‌న్న క‌సితో ఆయ‌న ప‌నిచేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇబ్ర‌హీంపట్నం నియోజ‌క‌వ‌ర్గం, తుర్క‌యంజాల్ మున్సిపాలిటీపై ఆయ‌న ఫోక‌స్ పెట్ట‌డంలేదని, చైర్ ప‌ర్స‌న్ కూడా అంటీము ట్ట‌న‌ట్టే ఉంటున్నార‌ని స్థానికులు అనుకుంటున్నారు. ఇక మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి వ‌రుస‌గా మూడు సార్లు ఓట‌మి పాలు కావ‌డంతో ఈసారి బ‌రిలోకి దిగే అవ‌కాశం లేద‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఇక కాంగ్రెస్‌లో ఉంటే తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో త‌మ‌ను ప‌ట్టించుకునేవారు క‌రువవుతార‌న్న భ‌యం, త‌మ వ్య‌వ‌హారాలు న‌డ‌వాలంటే పెద్ద‌ల అండ ఉండాలన్న ఆలోచ‌న‌ల‌తో ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డిని ప‌లువురు కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు క‌లిసి టీఆర్ఎస్‌లో చేర‌తామ‌న్న ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన‌ట్టు సమాచారం. నియోజ‌క‌వ‌ర్గంలోని మున్సిపాలిటీల్లో కాం గ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పుర‌పాల‌కం తుర్క‌యంజాల్‌. టీఆర్ఎస్‌ అధికారంలో లేదు కాబ‌ట్టి నిధులు ఇచ్చేందుకు మంచిరెడ్డి కొంత వివ‌క్ష చూపుతున్నార‌న్న విమ‌ర్శ ఎప్ప‌టి నుంచో ఉంది. కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్‌లో చేరి అధికారం క‌ట్ట‌బెడితే విరివిగా నిధులిచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుప‌డ‌తామ‌ని, అలాగే కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల‌కు చెందిన కొన్ని వెంచ‌ర్లు, భ‌వ‌నాల విష‌యంలోనూ క్లియ‌రెన్స్ ఇస్తామ‌ని ఎమ్మెల్యే హా మీ ఇచ్చిన‌ట్టు చ‌ర్చించుకుంటున్నారు.అంతా బాగానే ఉన్నా కాంగ్రెస్ కౌన్సి ల‌ర్లు టీఆర్ఎస్‌లో చేరితే కొత్త‌వారి డామినేష‌న్ పెరుగుతుంద‌ని, ఎప్ప‌టి నుంచో పార్టీ క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేస్తున్న త‌మ‌కు ప్రాధాన్యం త‌గ్గుతుం ద‌న్న మీమాంసలో ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు ఉన్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా తుర్క‌యంజాల్ మున్సిపాలిటీలో టీఆ ర్ఎస్‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తోన్న పెద్ద‌లు ఈ విష‌యంలో కొంత అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌‌ట్టు తెలుస్తోంది. తుర్క‌యంజాల్ మున్సిపాలిటీలో మొ త్తం 24 వార్డుల‌కు గాను కాంగ్రెస్ 17, టీఆర్ఎస్ 6, బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. మారుతున్న స‌మీక‌ర‌ ణాల నేప‌థ్యంలో మేజిక్ ఫిగ‌ర్ 13ను టీఆర్ఎస్ దాటేటట్లు తెలుస్తోంది. న‌లుగురు బ‌డా కౌన్సిల‌ర్లు ఎమ్మెల్యే మంచిరెడ్డిని క‌లిశార‌ని, వారితో పాటు త‌మ‌కు అనుకూలురైన మ‌రో న‌లుగురు కౌన్సిల‌ర్లు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు చ‌ర్చించుకుంటున్నారు. ఏదేమైనా తుర్క‌యంజాల్‌లో రా జ‌కీయం వాడివేడిగా న‌డుస్తూ.. కాం గ్రెస్‌లో క‌ల్లోలానికి తెర‌లేస్తున్న‌ట్టు క‌న్పిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed