హుజూరునగర్‌లో కాంగ్రెస్ నేతల మౌనదీక్ష

by Shyam |
హుజూరునగర్‌లో కాంగ్రెస్ నేతల మౌనదీక్ష
X

దిశ, హుజూర్ నగర్: టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు హుజూరు‌నగర్‌ గాంధీ పార్కు సెంటర్‌లో శుక్రవారం కాంగ్రెస్ నేతలు ‘‘అమర వీరులకు సలాం’’ పేరుతో మౌన దీక్ష నిర్వహించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. చైనాతో ఉద్రికత్తల నేపథ్యంలో అశువులు బాసిన అమర జవానుల కుటుంబాలను అవమానపరిచే విధంగా ప్రధాని వ్యవహరిస్తున్నారని అన్నారు. చైనాతో సరిహద్దు వివాదంపై దేశ ప్రజలను మోదీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, యరగాని నాగన్న గౌడ్, సాముల శివారెడ్డి, తన్నీరు మల్లికార్జున్ పాల్గొన్నారు.

Advertisement

Next Story