- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధర్నాలు కాదు ధాన్యం కొనండి.. కాంగ్రెస్ నాయకుల ఫైర్
దిశ,దుమ్ముగూడెం: ధర్నాలు కాదు ధాన్యం కొనుగోలు చేయండంటూ దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు తేల్లం నరేష్ మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడక కొనసాగుతుందని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధాన్యం ఆరబోసుకుని అమ్మడానికి ఎదురుచూస్తున్న సమయంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ధర్నాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని ఇది సమన్వయం కాదన్నారు. రైతులకు ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని, వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోటమల్ల సంగీతరావు, ఉబ్బా.వేణు, గౌరారేపు సతీష్ కృష్ణ, చంటి తదితరులు పాల్గొన్నారు.