రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతల అరెస్ట్

by Shyam |
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతల అరెస్ట్
X

దిశ, రంగారెడ్డి: పెండింగ్ ప్రాజెక్టులను, రిజర్వాయర్లను పూర్తి చెయ్యాలని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తల పెట్టిన ప్రాజెక్టుల వద్ద నిరసన తలపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్ చౌదర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులు అక్కడ నిరసన, ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 30 మంది కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story