కర్ణాటక తరహా రెవెన్యూ విధానం తేవాలి: వీహెచ్

by Shyam |
కర్ణాటక తరహా రెవెన్యూ విధానం తేవాలి: వీహెచ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర రెవెన్యూశాఖలో భారీగా అవినీతి పెరిగి పోయిందని, ధనార్జనే ధ్యేయంగా కొందరు ఉద్యోగులు రెవెన్యూ శాఖకు వస్తున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల రెవెన్యూ అధికారుల దృష్టి సమూలంగా మార్చాలని సూచించారు. ఖరీదైన భూముల వ్యవహారంలో రెవెన్యూ ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తూ దందాలు నడుపుతున్నారని, కర్ణాటక తరహాలో రెవెన్యూ విధానం తెస్తే రాష్ట్రంలో సత్ఫలితాలు వస్తాయన్నారు. గ్రామస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారులు లంచాలకు బానిసలుగా మారారని సీఎంకు రాసిన లేఖలో వీహెచ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story