ప్రధానివి అనాలోచిత నిర్ణయాలు.. చెవిటి వెంకన్న యాదవ్ ఫైర్

by Shyam |   ( Updated:2021-07-10 07:35:08.0  )
Congress leader Venkanna Yadav
X

దిశ, కోదాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ధరలు పెంచి పేద,మధ్య తరగతి ప్రజల నడ్డీ విరుస్తోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకసార్లు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిందని, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్నిసార్లు పెంచలేదని తెలిపారు. ఏడేండ్ల నుంచి పేదలను చిత్రహింసలకు గురిచేస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుంతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఈనెల 12 నుంచి సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సైకిల్ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక, అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ఉద్యమించాలన్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి మోడీ స్విస్ బ్యాంకులో ఉన్న నల్ల ధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి రూ. 15 లక్షలు జమ చేస్తానని నేటికీ రూ.15 పైసలు కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. నోట్లరద్దు, జీఎస్టీ, లాక్‌డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటు పడిందన్నారు. దేశానికి శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీ జెండా అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు డీసీసీ ఉపాధ్యక్షుడు సీతయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోటేశ్వరరావు, కౌన్సిలర్ షాబుద్దీన్, యాదగిరి, సుబ్బారావు, సత్యనారాయణ, బసవయ్య, సైదిబాబు, రజనీకాంత్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed