దొంగ ఓట్లతో గెలిచిందీ ఓ గెలుపేనా ?: తులసిరెడ్డి

by srinivas |
Tulasireddy-1
X

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బద్వేలు ఉపఎన్నికల్లో 1,47,213 ఓట్లు పోలయ్యాయని.. అందులో ప్రజలు 40 శాతం మాత్రమే ఓట్లు వేశారని తెలిపారు. మిగిలిన 60శాతం దొంగఓట్లు వేశారని ఆరోపించారు. ఈ మొత్తం ఓట్లలో దాదాపు 90 వేలు దొంగ ఓట్లు వేశారని ఆయన ఆరోపించారు. కేవలం 56 వేల ఓట్లు ప్రజలు వేశారని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లతో గెలిచిందీ ఓ గెలుపేనా అంటూ తులసిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు ఈసారి ఉపఎన్నికల్లో కూడా ప్రలోభాలకు గురి చేసిందన్నారు. ఉదయం 11 గంటల తర్వాత వైసీపీ కార్యకర్తలు రాయలసీమలోని పలు ప్రాంతాల నుంచి ఇతర వ్యక్తులను తీసుకువచ్చి దొంగఓట్లు వేయించారని తులసిరెడ్డి ఆరోపించారు.

Next Story

Most Viewed