కౌన్సిలర్ కాదు.. ఆమె భర్త మీడియాకు ఆంక్షలు విధిస్తాడా..?

by Shyam |
కౌన్సిలర్ కాదు.. ఆమె భర్త మీడియాకు ఆంక్షలు విధిస్తాడా..?
X

దిశ, తొర్రూరు : తొర్రూరు మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశానికి అనుమతి లేదంటూ 16వ వార్డు మహిళా కౌన్సిలర్ భర్త బిజ్జల అనిల్ మీడియాకు ఆంక్షలు విధించడం సిగ్గుచేటని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెవిటి సధాకర్ అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారికంగా జరుగుతున్న జనరల్ బాడీ సమావేశంలో మహిళా కౌన్సిలర్ భర్తలకు ఏం పని అని ప్రశ్నించారు.

సతుల స్థానంలో పతులు హాజరైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. అవగాహన రాహిత్యంగా మాట్లాడటం, విలేకర్ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టు లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అలువల సోమన్న, దికొండ శ్రీనివాస్, జాటోతు సురేశ్ నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story